NTV Telugu Site icon

పీఆర్సీ జీవో.. హై కోర్టులో పిటిషన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద్యోగుల పీఆర్సీ వ్య‌వ‌హారంపై మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు.. మ‌ళ్లీ పోరాటానికి దిగారు.. ఇక‌, ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హై కోర్టులో పిటిషన్ దాఖ‌లైంది.. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై కోర్టుకు వెళ్లారు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య… విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని త‌న‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.. సెక్షన్ 78(1) కి విరుద్ధంగా ఉన్న జీవోని రద్దు చేసేలా అదేశాలివ్వాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయ‌తే, ఈ పిటిష‌న్ రేపు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఈ వ్య‌వ‌హారంలో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఫైనాన్స్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను కూడా చేర్చారు పిటిష‌న‌ర్.. దీంతో.. హైకోర్టులో ఎలాంటి విచార‌ణ జ‌రుగుతోంది.. ఉద్యోగుల పిటిష‌న్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠ‌గా మారింది.

Read Also: అఖిలేష్‌కు మ‌రో షాక్‌… బీజేపీ గూటికి మ‌రో కీల‌క నేత‌