Site icon NTV Telugu

పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని మరో కౌంటర్ !

వరుస ట్వీట్ల తో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్‌ మరియు వైసీపీ నేతలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొన్న వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్‌ ఘాటు విమర్శలు చేస్తూ ట్విట్ చేయగా…. పవన్ చేసిన ట్విట్ కు అంతే ఘాటుగా రీ ట్విట్ చేశారు మంత్రి పేర్ని నాని. తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ట్విట్ చేయగా…. దానికి కౌంటర్‌ గా జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న’మస్కా’రాలు అంటూ పేర్ని నాని ట్విట్ చేశారు. అంతేకాదు… పవన్ కళ్యాణ్ ను వరాహంతో పోల్చుతూ అంటూ ట్విట్ చేశారు మంత్రి పేర్ని నాని. ఈ వరుస ట్వీట్ల తో… ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే… మంత్రి పేర్ని నాని చేసిన ట్వీట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version