YS Jagan on Super Six: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఒక్కటీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలను మోసం చేయడమే పాలనగా మారిందన్నారు. జగన్ ఇచ్చినవే కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారు.. తల్లికి వందనం కింద ఆంక్షలు లేకుండా రూ.15 వేలు ఇస్తామన్నారు. ఐదు లక్షల పెన్షనర్లకు కోత పెట్టారు.. ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు. అలాగే, ఆడబిడ్డ నిధి కింద రూ.36 వేలు ఇచ్చారా? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామన్నారు. ఇవన్నీ అబద్ధాలు కాదా? అని మాజీ సీఎం జగన్ విమర్శించారు.
Read Also: KP Sharma Oli: 24 గంటలుగా కనిపించని నేపాల్ మాజీ ప్రధాని ఓలి ఆచూకీ.. ఏదైనా జరిగిందా?
ఇక, నిరుద్యోగ భృతి విషయాన్ని వైఎస్ జగన్ ప్రస్తావిస్తూ.. ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఇవ్వాల్సింది.. రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.72 వేల బాకీ పడింది.. ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ మాట తప్పారని దుయ్యబట్టారు. అంతేకాదు, 50 ఏళ్లకే పెన్షన్లు రద్దు, ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది. నిరుద్యోగ భృతి లేదు, అన్నక్యాంటీన్లను కొత్తగా ఎవరికీ అర్థంకాని రీతిలో ‘సూపర్ సిక్స్’లో చేర్చారని విమర్శించారు. అలాగే, సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అని ప్రజలు అనుకుంటున్నారు.. “అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవం చేసినట్లుగా అనంతపురంలో బహిరంగ సభ పెట్టాడం దీనికి నిదర్శనమన్నారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఒక స్థాయిలో ఉన్నాయి.. ఆయన పంచిన బాండ్లు పచ్చిమోసమని ప్రజలకు అర్థమైందన్నారు.
