CM Jagan: ఎన్టీవీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రెహానా రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్ డ్రైవ్ పుస్తకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను సీనియర్ జర్నలిస్ట్ రెహానా పెన్‌డ్రైవ్ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. దీంతో ఆమెను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి పాల్గొన్నారు.
Read Also: couples get married in waterlogged temple: వాననీటిలో ఒక్కటైన జంట.. ఎక్కడో తెలుసా?
ఇక, సీనియర్ జర్నలిస్ట్ రెహానా రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్ డ్రైవ్ పుస్తకం విషయానికి వస్తే..
1. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు వ్యాసాలకు ముడి సరుకులు అయ్యాయి.
2. సామాజిక, రాజకీయ, ఆర్ధిక సంబంధ విషయాల పై ఎక్కువగా వ్యాసాలు రాశారు.
3. ప్రజాతంత్రలోనే కాకుండా సాక్షి, ఇతర పత్రికలలోనూ పలు వ్యాసాలు అచ్చయ్యాయి.
4. గత మూడు, నాలుగేళ్ళుగా రాసిన వ్యాసాల్లో 40 వ్యాసాలను ఈ పుస్తకం కోసం ఎంపిక చేశారు.
5. ఉక్రెయిన్, శ్రీలంక, నేపాల్ వంటి పలు దేశాల్లో జరుగుతున్న పరిణామాల పై తనదైన పరిశీలన, విశ్లేషణ ఇచ్చారు.
6. విష చక్రంలో శ్రీలంక, అవిశ్వాసం ముంగిట ఇమ్రాన్ ఖాన్, కిరాయి యుద్ధం, కమలం నేర్పుతున్న పాఠాలు, పులుల మధ్య పిల్లికూన వంటివి ఆమె రాసిన కొన్ని వ్యాసాలు.
7. కరోనా కాలపు పరిణామాలను కూడా రచయిత్రి స్పృశించారు.
8. ప్రస్తుత సమాజపు రాజకీయ, సాంఘిక పరిణామాల క్రమాలను ఈ వ్యాసాలు అద్దం పడుతున్నాయి.
