NTV Telugu Site icon

PeddiReddy Ramachandra Reddy: ఇది రైతు పక్షపాత ప్రభుత్వం

Peddi Reddy

Peddi Reddy

దేశంలోని 12 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులని విడుదల చేశారు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే నిధులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా అందిస్తున్నారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రామంలోనే గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించారు. రైతులకు అవసరమయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ఆఫ్రికా దేశాలకు మనలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంక్ కోరింది. రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తే బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు విమర్శించారు. రైతులకు అవసరమైన అన్ని అంశాలు ఆలోచించి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

అజాదీ కా అమృత్ లో భాగంగా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎంపి రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్ ఎం హరి నారాయణన్ హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వ ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్న రైతుల పేర్లు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in లో ఉంటాయి. మీరు కూడా ఈ స్కీమ్‌కు అర్హులైతే మీరు వెబ్‌సైట్ ద్వారా జాబితాలో మీ పేరును చెక్ చేసుకోండి.

Chandrababu: కశ్మీర్ టు కోనసీమ.. ఇది చాలా బాధాకరం