Site icon NTV Telugu

Minister Peddireddy : క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి

తిరుపతిలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం నుంచి తిరుపతి వస్తున్న పెళ్లి బృందం బస్సు లోయలో పడింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా, సుమారు 300 అడుగుల లోయలో పడ్డ బస్సు పడిపోయింది. దీంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ నేపథ్యంలో బస్సు ప్రమాదం క్షతగాత్రులను రూయా ఆసుపత్రిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పరామర్శించారు.

అంతేకాకుండా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్, అధికారులను ఆదేశించారు. జెడ్పీ పంచాయితీ ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి ప్రమాదాల నివారణకి చర్యలు చేపడుతామన్నారు. ప్రాథమికంగా భాకరాపేట ఘాట్‌ రోడ్డులో రైలింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. 1500 కోట్లతో ఈ రోడ్డు ఫోర్ లైన్ రహదారిగా నిర్మిస్తామని, క్షతగాత్రులకి 50 వేలు ఆర్థిక సహాయం, మృతులకి 2 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version