Site icon NTV Telugu

విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరం.. ఏపీ సర్కార్‌పై పయ్యావుల ఫైర్

అనంతపురం : ఏపీ సర్కార్‌ పై మరోసారి ఫైర్‌ అయ్యారు పయ్యావుల కేశవ్. జగన్‌ ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ రంగంలో తప్పులు జరుగుతున్నాయని… రాయలసీమ పవర్ ప్లాంట్ ను అన్యాయంగా మూసివేశారని మండిపడ్డారు. అత్యధిక ధరలకు విద్యుత్ ను బయట నుంచి కోనుగోలు
చేయడం ఎవరిదీ తప్పు…? అని ప్రశ్నించారు పయ్యావుల. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరమన్నారు పయ్యావుల. ట్రూ అప్ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని… ట్రూ అప్ ఛార్జీలను ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ తప్పిదాలకు ఈఆర్ సి తలదించుకునే పరిస్థితి వచ్చిందని…విద్యుత్ రంగ సంస్థలో జరుగుతున్న వాటికి బాధ్యులెవరూ….!అని నిలదీశారు. ఎనర్జీ డిపార్ట్ మెంట్ తప్పిదాలు చేస్తోందని… ఈఆర్ సి ప్రజల పక్షాన నిలబడాలని తెలిపారు. ట్రూ అప్ ఛార్జీలు ఒకే రాష్ట్రం మూడు బిల్లులు లా పరిస్థితి తయార్తెయిందని… సబ్ స్టేషన్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఫైర్‌ అయ్యారు. ఈ పరిస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలప్తె ఈఆర్ సి ఎందుకు మాట్లాడడం లేదని.. ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ప్రజలప్తె భారం పడుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను , జీవోలను విత్ డ్రా చేయాలని.. ఈఆర్ సి లోని పెద్దలు సామాన్యల వద్ధకు వెళ్లి పబ్లిక్ హియిరింగ్ పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version