NTV Telugu Site icon

Pawan Kalyan: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి

Pawan On Vizag Steel Plant

Pawan On Vizag Steel Plant

Pawan Kalyan Wants Vizag Steel Plant Should Be Owned By The Central Government: తెలుగువారి భావోద్వేగాలతో పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ ముడిపడి ఉందని.. 32 మంది ప్రాణ త్యాగాలతో, ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా ఈ పరిశ్రమ సిద్ధించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంతటి ఘన నేపథ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలని తమ జనసేన పార్టీ ఆకాంక్షిస్తోందని అన్నారు. ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారన్న ప్రకటన వచ్చినప్పుడు.. తాను వెంటనే ఢిల్లీ వెళ్లి, బీజేపీ అగ్రనాయకత్వంతో కలిసి చర్చించానని, దీనిపై వారు సానుకూలంగానే స్పందించారని తెలియజేశారు. ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిందన్నారు.

Ravi Shastri: టీమిండియాకి మరో యువ సంచలనం దొరికాడు.. అతడు అద్భుతాలు సృష్టిస్తాడు

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాని కలిసి.. విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న బంధాన్ని తెలియచేసి, ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని తాను కోరానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదని, దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని ప్రకటన చేయడం హర్షణీయమని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారని.. ఇందులో కొందరికి ఇప్పటివరకూ సెటిల్మెంట్ కాలేదని చెప్పారు. ఇలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. కానీ వారికి మొదటి నుంచి చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించి.. రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకొని, కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని విజ్ఞప్తి చేశామన్నారు. అయినా దానిపై వైసీపీ పాలకులు స్పందించలేదని మండిపడ్డారు.

Chennai Super Kings: చెన్నై మరో ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ప్లేయర్ ఔట్

జనసేన పార్టీ ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులతో చర్చించినప్పుడు.. విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కొన్ని రోజుల కిందట పొరుగు రాష్ట్రం ఈ అంశంలో స్పందించిందన్నారు. దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారు తప్ప.. పరిశ్రమను కాపాడుతామనే మాట చెప్పలేకపోయారని ఫైర్ అయ్యారు. చిత్తశుద్ధి లేని రాష్ట్ర పాలకుల వల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు వెళ్లలేదని ఆరోపించారు. ఈ క్రమంలో.. ఇప్పటికిప్పుడే ఈ పరిశ్రమని ప్రైవేటుపరం చేయడం లేదని కేంద్రమంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపిందన్నారు. జనసేన పార్టీ తొలి నుంచి ఈ పరిశ్రమను పరిరక్షించాలనే కోరుతోందన్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించిన దృష్ట్యా.. విశాఖ ఉక్కు బలపడుతుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Show comments