Site icon NTV Telugu

వైసీపీకి భయం ఏంటో నేర్పిస్తా.. దాక్కుంటే లాక్కొచ్చి కొడతా : పవన్ కళ్యాణ్

Pawan

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పార్టీ నేతలకు భయం ఏంటో నేర్పిస్తానని…. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని హెచ్చరించారు పవన్‌ కళ్యాణ్‌. 150 దేవాలయాల పై దాడులు చేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోదా..? అని నిలదీశారు. ఉదయం లేచింది మొదలు.. వైసీపీ కమ్మ కులాన్ని తిడుతుంటే.. వాళ్లు మీ వర్గాన్ని తిట్టరా..? అని నిలదీశారు. వైసీపీ నేతలకు చెబుతున్నాను.. వ్యూహం వేస్తున్నానని హెచ్చరించారు.

ఏపీలో పరిస్థితిని ఢిల్లీ వాళ్లకి చెప్పానని…. వైసీపీ దుష్టపాలనకు అంతమొందిచాల్సిన సమయం ఆసన్నమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్‌ కళ్యాణ్‌.  తాను రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చానని… పొలంలో కలుపు మొక్కలను పీకినట్టు.. రాజకీయాల్లో కలుపు మొక్కలను పీకేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఏపీ లో వైసీపీ పాలన దారుణంగా ఉందన్నారు.  అడుగుతున్నారని కోడి కత్తి గ్యాంగులతో అరచాకాలు సృష్టిస్తారా..? నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా..? మీ వైసీపీ నేతలకే ఉన్నాయని మండిపడ్డారు. 

Exit mobile version