Site icon NTV Telugu

విశాఖకు చేరుకున్న జనసేనాని

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను కేంద్రం ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించింది. దీంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఉక్కు పరిరక్షణ సమితికి సంఘీభావం తెలుపేందుకు ఈ రోజు విశాఖకు చేరుకున్నారు.

ఈ క్రమంలో కూర్మన్నపాలెం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. విశాఖకు చేరుకున్న జనసేనాని సభాస్థలికి చేరుకోనున్నారు. అనంతరం ఉక్కు కార్మికులకు సంఘీభావం తెలుపుతారు. ఇప్పటికే ఈ విషయమై పునరాలోచన చేయాలని కోరుతూ పవన్‌ కేంద్రానికి వినతి ప్రతం అందజేశారు.

Exit mobile version