Pawan Kalyan: ప్రస్తుతం బందర్ మొత్తం ఒకేఒక మాట వినిపిస్తోంది.. అదే పవన్ కళ్యాణ్. నేడు జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం కావడంతో మచిలీపట్నంలో దిగ్విజయ భేరీ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక వారాహి వాహనంపై వస్తున్న జనసేనానికి అభిమానులు సాదర స్వాగతం పలుకుతున్నారు. ఇక సేనాని వస్తున్నాడు అని తెలియడంతో సైనికులు అలెర్ట్ అయ్యారు. పవన్ రాకతో విజయవాడ – మచిలీ పట్నం హైవేపై ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయ్యింది. వందల సంఖ్యలో బైకులతో పవన్ వారాహి వాహనాన్ని అభిమానులు అనుసరిస్తున్నారు. మరికొద్దిసేపట్లో పవన్ దిగ్విజయ భేరీ సభకు చేరుకోనున్నారు.
Pawan Kalyan: జనసేన దిగ్విజయ భేరి.. మేము సైతం అంటున్న డైరెక్టర్స్
ఇక ఈ భారీ ర్యాలీలో పవన్ మరోసారి తన మానవత్వాన్ని చూపించారు. ర్యాలీ వలన ఒక ప్రాణం పోకూడదని ఆలోచించిన ఆయన.. తన వారాహిని పక్కకు జరిపి అంబులెన్స్ కు దారి ఇచ్చారు. భారీ ర్యాలీ వలన ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఒక అంబులెన్స్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పవన్.. ముందు అంబులెన్స్ కు దారి ఇవ్వాలని అభిమానులను కోరారు. అంతేకాకుండా తన వారాహి వాహనాన్ని పక్కకు జరిపి.. అంబులెన్స్ కు దారి ఇచ్చారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
