వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జల విలయం జన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుంది. కూలిన ఇళ్లు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తాయి.. అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయని పేర్కొన్న ఆయన.. జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వరద గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారని తెలిపారు. నిత్యావసరాలు, పాత్రలు, దుప్పట్లు బాధితులకు అందచేశారని పేర్కొన్నారు. ఆ గ్రామాల్లో విద్యుత్ ఇప్పటికీ పునరుద్ధించలేదని మండిపడ్డారు.. చీకట్లో బతుకుతున్నారని, గూడు కోల్పోయి నిరాశ్రయంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధితులకు ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు? అంటూ నిలదీశారు పవన్ కల్యాణ్.
ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు?.. పవన్ ఫైర్

pawan kalyan