NTV Telugu Site icon

Viral: వీరాభిమాని అంటే ఇతడే.. జనసేన మేనిఫెస్టోతో పెళ్లి శుభలేఖ

Invitation

Invitation

చాలా మంది అభిమానులు తమకు ఇష్టమైన హీరోలపై వివిధ రూపాల్లో అభిమానాన్ని చాటుతుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తూ.గో జిల్లా కొవ్వూరు చెందిన కోటే హరీష్‌బాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీపై వినూత్న రీతిలో తన అభిమానం చాటుకున్నాడు. ప్రస్తుతం కోటే హరీష్‌బాబు జనసేన లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న ఆయన వివాహం చేసుకోనున్నాడు.

ఈ సందర్భంగా కోటే హరీష్‌బాబు తన వివాహ శుభలేఖలో పైభాగంలో జనసేన పార్టీ మేనిఫెస్టో, గుర్తు, పవన్ ఫోటోలను ముద్రించాడు. శుభలేఖ కింది భాగంలో పెళ్లి ముహూర్తం వివరాలను తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రాణమని.. ఆయన సిద్ధాంతాలు తనకు ప్రేరణ కలిగించాయని కోటే హరీష్‌బాబు పేర్కొన్నాడు. అటు మేనిఫెస్టోతో ముద్రించిన ఈ శుభలేఖ జనసేన అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

CCTV Cameras: పొరుగు రాష్ట్రాల కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్

Show comments