Pawan Kalyan Demands Transfer of Security Officials in AP: ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద జరిగిన రాయి దాడి గురించి పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వి విఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు, అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా, మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పరదాలూ కట్టలేదు, చెట్లూ కొట్టలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలి అని డిమాండ్ చేసిన ఆయన వాళ్ళు తీసుకున్న భద్రతా చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలని పవన్ కళ్యాణ్ కోరారు.
Bhavesh Bhandari: రూ.200 కోట్ల ఆస్తిని కాదని.. సన్యాసం తీసుకున్న కుటుంబం..
ముందు సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి, ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుందని, సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీ పరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, ఇలాంటి అధికారులు ఉంటే- గౌరవ ప్రధానమంత్రి మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు, వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? అని పవన్ ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలని ఆయన ఎన్నికల సంఘం, అధికారుల ట్విట్టర్ అకౌంట్స్ ను టాగ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ…
— Pawan Kalyan (@PawanKalyan) April 15, 2024