NTV Telugu Site icon

Pawan Kalyan: నేను ఎందుకు ఇన్ని దెబ్బలు, అవమానాలు పడాలి?

Pawan Kalyan Janasena

Pawan Kalyan Janasena

Pawan Kalyan comments at vaarahi yatra 2 sabha: ఏలూరులో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వారాహి 2వ దశ విజయ యాత్ర కు ఏలూరులో ఇంత ఘన స్వాగతం లభిస్తుంది అనుకోలేదు, దారిపొడవునా అక్కాచెల్లెళ్ళు, తల్లులు ప్రేమాభిమానాలు చూపించారని అన్నారు. హల్లో ఏపీ – బైబై వైసీపీ అనే నినాదం చాలా నలిగిపోయి, ప్రజలు బాధలు పడ్డాక బయటకు వచ్చింది, ఇది నా నుండి వచ్చిన నినాదం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుండి వచ్చిన నినాదం అని అన్నారు. నేను ఎందుకు ఇన్ని దెబ్బలు, అవమానాలు పడాలి? మీరు అభిమానించే హీరోను , సరదాగా రాజకీయాల్లోకి రాలేదు… స్కూల్లో మహనీయుల గురించి చెప్పి, విలువలు నేర్పించి, బయట నేరగాళ్లు, విలువలు లేని వాళ్ళు పాలిస్తుంటే నచ్చలేదు, మీ భవిష్యత్తు కోసం పనిచేయాలి, అని గెలుపు వచ్చినా, ఓటమి వచ్చినా పర్లేదు అని పోరాటానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు.

Ee Nagaraniki Emaindi: రీరిలీజులో రచ్చ రేపిన ఈ నగరానికి ఏమైంది కలెక్షన్స్

నేను రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుతుంటే, వైసీపీ నాయకులు నా తల్లి గురించి, నా ఇంట్లో ఆడవారి గురించి, పిల్లల గురించి మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారని ఆయన అన్నారు. అందరికీ సమన్యాయం అనే అంబేద్కర్ గారి స్ఫూర్తి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్న ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంచోడా, చెడ్డోడా అని చూడకుండా ఆ స్థానానికి నేను గౌరవించని, జగన్ రెడ్డి గారు అని గౌరవించాను… ఈరోజు నుండి అంబేద్కర్ గారి సాక్షిగా జగన్ రెడ్డి ని ఏకవచనంతో పిలుస్తాను, ఈ జగన్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని పవన్ అన్నారు. వైఎస్ జగన్, వైసీపీ రాష్ట్రానికి సరైనది కాదని, 2024 లో వైఎస్ జగన్, వైసీపీ రాష్ట్రానికి అవసరం లేదని,. ఇక్కడ ఉన్న పోలీస్ దగ్గర నుండి, యువతీ, యువకుల ఉద్యోగ సమస్యలు, ఆడపడుచుల రక్షణ, రోడ్ల సమస్య, గంజాయి సమస్యలు ఉన్నాయి, ఈరోజు వీటి గురించి మాట్లాడుతానని అన్నారు. మనం వైఎస్ జగన్, వైసీపీకి బానిసలు కాదు, ఆయన మనలో ఒకడు అంతే. మన అందరం టాక్సులు కడితే, ఆ డబ్బుతో పాలన చేసే వ్యక్తి, ఆయన కేవలం జవాబుదారీ మాత్రమే అని అన్నారు.

Show comments