NTV Telugu Site icon

రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పట్టాభిరామ్‌..

ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి పట్టాభిరామ్‌ ను విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు, గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న న్యాయమూర్తి మూర్తి పట్టాభిరామ్‌ కు నవంబర్‌ 2 వరకు రిమాండ్‌ విధించింది.

దీంతో పోలీసులు పట్టాభిరామ్‌ ను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు ఈ రోజు ఉదయం తరలించారు. పట్టాభిరామ్‌ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టాభిరామ్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు నిరసనగా జనాగ్రహ దీక్షకు దిగారు.