Site icon NTV Telugu

బెజవాడలో నేటి నుండి పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు…

బెజవాడలో నేటి నుండి ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా రద్దయిన రైళ్లు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. కానీ ఈ ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ ప్రెస్ చార్జీల మోత మోగుతుంది. ఇకపై 30 నుండి 200 శాతం అదనంగా టికెట్ ధర వసూలు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చారు. అయితే పెరిగిన ఈ టికెట్ ధరలతో వలస కార్మికులకు, మధ్యతరగతి ప్రజలపై మొయ్యలేని భారం పడుతుంది. ఇక పెరుగుతున్న టికెట్ ధరలపై పబ్లిక్ మండిపడుతున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ లో ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదుకాగా అవి ఇప్పుడు తగ్గుతున్నాయి.

Exit mobile version