రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులపై పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను అక్రమాలు చేస్తే నిరూపించాలి ఒట్టి మాటలు మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయ్యారు. మా మామ కమ్యూనిస్టు కృష్ణారావు పేరు మీద ఎయిర్‌పోర్టు వద్ద 200 ఎకరాలు ఉన్నాయన్నారు. అది నిరూపిస్తే.. 200 ల ఎకరాలను ఆర్డీటీ సంస్థకు అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ర రెడ్డితో పాటు ఆయన సోదరుల పేరు మీద ఎన్నో ఆస్తులున్నాయని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. కాంట్రాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ఎవరు.. నీ బినామీ కాదా..? అంటూ ప్రశ్నించారు. పరిటాల రవికి ఎమ్మెల్యే కాక ముందే వ్యాపారాలు ఉన్నాయి. ఆయన ఆరోజుల్లోనే విమానాల్లో తిరిగారు. అప్పుడే వ్యాపారాలు చేశారు. చాలా ఇబ్బందుల తర్వాత మేము కోలుకుని ఆస్తులు సంపాదించామని శ్రీరామ్ అన్నారు. మేము ఏది కొన్నా.. లేదా వ్యాపారాలు చేసినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నామన్నారు. మాకు ఎక్కడ ఆస్తులు ఉన్నాయో ఒక లెటర్ రాస్తే మేమే వివరాలు అందిస్తామని ప్రకాష్ రెడ్డి సోదరులకు చురకలు అంటించారు శ్రీరామ్.
Read Also: కేంద్రం ప్రజల జేబులకు చిల్లులు పెడుతుంది: మంత్రి జగదీష్ రెడ్డి
పరిటాల రవిని చంపితే ఆస్తులు రాలేదు. మీ అన్నలు ఇప్పటికీ మర్డర్ కేసుల్లో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే పెద్ద సోదరుడు కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో ఎలా వసూళ్లకు పాల్పడుతున్నారో తెలుసా అంటూ శ్రీరామ్ ఫైర్ అయ్యారు. తోపుదుర్తి డెయిరీ ద్వారా 50లక్షలు ఎవరి అకౌంట్‌కు మళ్లించారు.. మిషనరీ కొనడానికి రెండేళ్లు సమయం పడుతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5కోట్ల డబ్బుతో హైదరాబాద్ గోదా టవర్స్‌లో ప్లాట్ కొన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. చమన్ నాకు చిన్నాన్న లాంటి వారు.. ఆయన మృతి వెనుక ఏముందే నువ్వే తేల్చు అంటూ ప్రకాష్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు శ్రీరామ్. నేనేమి జగన్‌లా కాదు సొంత చిన్నాన్నని చంపుకునేందుకు.. అధికారం ఉంది కదా నిరూపించుకో.. సీఎంకు రాయాల్సింది నా మీద కాదు. నియోజకవర్గ సమస్యల మీద అంటూ చురకలు అంటించారు. నియోజకవర్గంలో 5మంది ఎమ్మెల్యేలు సామంత రాజుల్లా ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. సీఎం దగ్గర నీ చిట్టా ఉంది.. నన్ను మించి చేస్తున్నారని జగన్ ఆశ్చర్యపోతున్నారు. నిన్ను నీ సోదరులే చంపేందుకు చూస్తున్నారని ప్రచారం జరగుతుందంటూ పరిటాల శ్రీరామ్ అన్నారు.