NTV Telugu Site icon

భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలి: మంత్రి పెద్దిరెడ్డి


వాల్టా చట్టం పై అధికారులతో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ-సీఈడబ్ల్యుఎ నిబంధనల అమలు పై ప్రధానంగా చర్చించారు. ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సీఈడబ్ల్యుఎ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపును పరిశీలించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఛార్జీల ఖరారులో పరిశ్రమలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భూగర్భ జలాలను వినియోగించే చిన్న పరిశ్రమల పట్ల ఉదారంగా వ్యవహరించాలని మంత్రి అధికారులకు సూచించారు. భూగర్భ జలాల వినియోగం పై కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వాల్టా చట్టంలో అవసరమైన మార్పులు తీసుకురావాలని ఆయన అధికారులను ఆయన ఆదేశించారు.

తాగు నీరు, వ్యవసాయం కోసం వినియోగించే భూగర్భ జలాల విషయంలో ఛార్జీలు విధించొద్దన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోకుండా సరైన స్థాయిలో వినియోగించేందుకు, కేంద్రం రూపొందిం చిన నిబంధనల అమలుపై అధికారులు అధ్యయనం చేసి తగిన మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Show comments