ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాణిపాకం ఆలయంలో భక్తులకు షాక్ ఇచ్చింది.. ఒకటి. కోరికలు నెరవేర్చే మహిమగల పుణ్యక్షేత్రంగా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి పేరు ఉంది.. అయితే, కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ల ధర భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది పాలక మండలి… పంచామృతాభిషేకం టికెట్ ధర ప్రస్తుతం 700 రూపాయలుగా ఉంటే.. ఆ టికెట్ ధరను ఏకంగా 5000 రూపాయలకు పెంచుతూ నోటీస్ బోర్డ్ లో ప్రకటించింది ఆలయ కమిటీ.. ఇప్పటిదాకా రోజూ మూడుసార్లు నిర్వహిస్తున్న పంచామృత అభిషేకం సేవ ఇకపై ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక అభిషేకంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం వెల్లడించింది.. అయితే, అభిషేకం ధర పెంపుపై అభిప్రాయాలను తెలిపేందుకు 15 రోజులు గడువు విధిస్తూ నోటీసు బోర్డు ప్రకటన విడుదల చేశారు.. మరి భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది.. టికెట్ల రేట్లపై ఆలయ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Munugode Bypoll: సమయం ఆసన్నమైంది.. రేపటి నుంచే మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు..