తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో ఘనంగా బోనాల పండగా జరుగుతుంది. ఈ పండగను అంగరంగ వైభవంగా రాష్ట్ర నలుమూలల ఘనంగా జరుపుకుంటారు. అయితే, మేళతాళలతో పోతు రాజుల విన్యాసాలతో జోరుగా ఈ బోనాల జాతర కొనసాగుతుంది. అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేసేందుకు ట్రాన్స్ జెండర్స్ ముందు వరుసలో ఉంటారు. ఈ ఆషాడ బోనాల పండగ వారికి ప్రత్యేకమైనది. అమ్మవారిని తమ ఇంటి దైవంగా వారు భావిస్తారు. అయితే ఈ బోనాల పండగ అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరుపుకుంటారు.
Read Also: North Korea: వీధుల్లోకి లక్షలాది మంది కొరియన్లు.. అమెరికాను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఆషాడ మాసం సందర్భంగా ట్రాన్స్ జెండర్లు అమ్మవారికి మేళాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఇంటి నుంచి గంగమ్మ తల్లి ఆలయం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా బోనాలతో వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని వెల్లడించారు. బిక్షాటన చేసి జీవనం సాగిస్తున్న తమకి దానం చేసిన ప్రతి ఒక్కరూ పిల్లా పాపలతో చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటామని వారు పేర్కొన్నారు.
Read Also: Adipurush : ఆదిపురుష్ సినిమాకు సీక్వల్ రాబోతుందా..?
ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో కూడా ఇలాంటి పూజలను నిర్వహిస్తామని మొదటి సారిగా పల్నాడు జిల్లాగా ఏర్పడిన తరుణంలో తాము పల్నాడు జిల్లాలో ఉన్నందుకు గర్వపడుతున్నామని ట్రాన్స్ జెండర్లు అన్నారు. తమకు అన్నివిధాలుగా సహకిస్తున్న కలెక్టర్ కు, అధికారులకు హృదయపూర్వక నమస్కారాలను వారు తెలియజేశారు. తమకు సీఎం జగన్ ప్రభుత్వం సొంత ఇళ్లను కల్పించిందని అందులో భాగంగా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.