Site icon NTV Telugu

Gold Fraud: బ్యాంకుల్లో తాకట్టు బంగారం విడిపిస్తామని మోసం.. 9 మంది అరెస్ట్!

Gold

Gold

Gold Fraud: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తామని మోసానికి పాల్పడుతున్న 9 మందిని అరెస్టు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే, పట్టుబడిన నిందితుల వద్ద నుంచి 2 కార్లు, 3 కత్తులు, 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీన మాచర్లలో జరిగిన చోరీ కేసులో నిందితులను విచారించగా అసలు బాగోతం బయటపడింది.. ప్రైవేటు బ్యాంకుల్లో పని చేసే బంగారం అప్రయిజర్లతో కుమ్మక్కై మోసాలకు పాల్పడుతున్నారు అని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Read Also: Back Pain: నడుం నొప్పి వేధిస్తోందా? ఈ చిన్న చిట్కా పాటించండి..

ఇక, ఈ కేసులో మంగళగిరికి చెందిన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ లో గుమస్తాలుగా పని చేస్తున్న వ్యక్తులు కీలకపాత్ర పోషించారు అని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఈ మోసానికి పాల్పడిన నిందితులు రాము, మహిమ క్రాంతి, ప్రసేన్ బాబు, సాయిరాం, రాధిక, నాగరాజు, వెంకట శివ రామకృష్ణ, లక్ష్మీ బాబు, నాగ లోకేష్ లను అరెస్టు చేశామని వెల్లడించారు.

Exit mobile version