Deputy CM Pawan Kalyan: ఈ రోజు పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు రానుండటంతో అధికారులు, నేతలు ఏర్పాట్లు చేశారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలిస్తారు. ఇప్పటికే సరస్వతి భూములను సర్వే చేయాలని అధికారులను పవన్ ఆదేశించిన విషయం విదితమే కాగా.. వారం రోజుల క్రితమే అధికారులు సర్వే పూర్తి చేశారు. దీంతో నేడు స్వయంగా భూములను పరిశీంచనున్నారు పవన్ కల్యాణ్.. అయితే, వైఎస్ హయాంలో కేటాయించిన 15 వందల ఎకరాల భూముల్లో అటవీ భూములున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: Actress Kasturi : తెలుగు రాజకీయాల్లోకి నటి కస్తూరి.. ఏ పార్టీ అంటే..?
కాగా, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. తాను హోంమంత్రిని అయితే… పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారాయన. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావప్రకటనా స్వేచ్ఛ అంటున్నారని… అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. NDA ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేయడం చర్చగా మారిన విషయం విదితమే..