CM Chandrababu: నా లక్ష్యం ఒక్కటే.. అది, అందరికీ ఆదాయం పెరగాలి అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అమలు చేశాం.. తల్లికి వందనం అందరు పిల్లలకు ఇచ్చాం.. ప్రజలే ఆస్థి.. మన పిల్లలే మన ఆస్థి.. అని పేర్కొన్నారు.. ఒకేసారి పదివేలకోట్లు నేరుగా ప్రజలకు ఇచ్చాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. ఆడబిడ్డల సంక్షేమంకోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం.. రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా 20వేలు ఇస్తున్నాం.. మొదటి విడత ఏడువేలు ఇచ్చాం… ఏడాదిలో పదహారు వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.. అయితే, పది లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. పేదరికం లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్నా.. ఏడాదికి 34 వేల కోట్లు ఫించన్ల రూపంలో ఇస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయన్నారు..
Read Also: Ranchi: హోటల్ గదిలో ISIS ఉగ్రవాదుల కోసం స్టూడెంట్ బాంబు తయారీ..
ఇక, జీఎస్టీ తగ్గింపుతో నిజమైన దసరా, దీపావళి వచ్చింది.. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయి.. నా లక్ష్యం ఒక్కటే… అందరికీ ఆదాయం పెరగాలి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీ పనులు వెంటనే పూర్తవుతాయి.. పనిలో రాజీలేదని స్పష్టం చేశారు.. 730 సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకం ద్వారా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.. అక్టోబర్2 గాంధీ జయంతి కల్లా లెగసీ వేస్ట్ తొలగిస్తాం. స్వచ్ఛ వాహనాలు మీ ఇంటికి వస్తాయి… పాత వస్తువులు ఇస్తే మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇస్తాం. ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేస్తాం అని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
