Site icon NTV Telugu

Ganja Seized: ట్రైన్ లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్స్.. పట్టుకున్న పోలీసులు

Untitled Design (4)

Untitled Design (4)

గతంలో స్మగ్లర్లు కార్లు, బస్సులు, బైక్ లలో స్మగ్లింగ్ చేసేవారు. ప్రస్తుతం రైళ్లలో కూడా డ్రగ్స్ స్మగింగ్ల్ చేస్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Immunity: చలికాలంలో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ట్రైన్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పల్నాడు స్టేషన్ కు చేరుకున్న పోలీసులు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేపట్టారు . అయితే ఓ కంపార్ట్మెంట్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. పెద్ద బ్యాగు నిండా ఉన్న చాక్లెట్లను కనిపించాయి. అవి చూసిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కంగుతిన్నారు. అవి మాములు చాక్లెట్లు కావు.. గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు కావడం విశేషం. వెంటనే వాటిని లెక్కించడంతో దాదాపు రెండు వేల చాక్లెట్లు ఆ బ్యాగులో దొరికాయని పోలీసులు వెల్లడించారు.

Read Also: Youngest Mla: ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ ఆస్తులెంతో తెలుసా..

అయితే పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నిందితులు.. గంజాయి ఉన్న బ్యాగులను సీట్ల కింద పెట్టేసి పారిపోయారు. వెంటనే ఆ గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు..అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఇది అంతర్‌ రాష్ట్ర గ్యాంగ్‌ పనా.. లేదా లోకల్‌ ముఠానా.. అనే విషయం తెలియజేస్తామని.. తొందర్లోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

Exit mobile version