NTV Telugu Site icon

మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి.. స‌జ్జ‌ల కాళ్ల‌పై ప‌డిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌మ్మెబాట ప‌డుతోన్న ఉద్యోగుల‌ను ఆపేందుకు సీఎం, మంత్రుల క‌మిటీ, సీఎస్‌.. ఇలా అంద‌రూ రంగంలోకి దిగారు.. స‌మ్మె డెడ్‌లైన్ ముంచుకొస్తుండ‌డం.. ఇప్ప‌టికే ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు ఉధృతంగా సాగుతోన్న త‌రుణంలో.. ఇవాళే ముగింపు ప‌ల‌కాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది ప్ర‌భుత్వం.. మ‌రోవైపు.. త‌మ స‌మ‌స్య‌ల్ని కూడా ప‌రిష్క‌రించాలంటున్నారు ఔట్‌సోర్కింగ్ ఉద్యోగులు.. ఇవాళ ఏకంగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కాళ్ల‌పై ప‌డ‌డం చ‌ర్చ‌గా మారింది.. స్టీరింట్ క‌మిటీ స‌మావేశం కోసం మ‌ధ్యాహ్నం స‌చివాల‌యానికి వ‌చ్చారు.. ఈ స‌మ‌యంలో.. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ స‌జ్జ‌ల కాళ్ల‌పై ప‌డ్డారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు కూడా పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.. కనీస వేతనాన్ని ఇప్పుడు ఉన్న రూ.15 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని స‌జ్జ‌ల‌ను కోరారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.

Read Also: కుప్ప‌కూలిన విమానం.. ఒక్క‌రు కూడా మిగ‌ల‌లేదు..