కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరులో దారుణం జరిగింది. ఫిషింగ్ హార్బర్ చూసేందుకు వెళ్లిన ప్రేమజంటపై అత్యాచారయత్నం చేశారు దుండగులు. ప్రియుడిని తాళ్లతో చెట్టుకు కట్టేసి.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు.. బందర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డ నాగబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
Read Also: Owaisi: తక్కువ అంచనా వేయొద్దు.. దేశంలో కేసీఆర్‌ని మించిన నేత లేరు..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. తన ప్రియుడితో కలిసి బీచ్‌కి వెళ్లింది విద్యార్థిని.. ఇరువురు మాట్లాడుకుంటుండగా.. వారి వద్దకు వెళ్లిన ఇద్దరు మందుబాబులు. ప్రియుడిని తాళ్లతో చెట్టుకు కట్టేశారు.. విద్యార్థినిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడాడ్డో మందు బాబు.. ఈ ఘటనను ఎవరికీ చెప్పుకోలేక మిన్నుకుండి పోయింది ప్రేమజంట.. అయితే, మదన పడిపోతున్న విద్యార్థిని గమనించిన తల్లిదండ్రులు… గట్టిగా నిలదీయగ తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది విద్యార్థిని.. విషయం తెలుసుకుని బందర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నాగబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు..
