Site icon NTV Telugu

AP New Districts: ఏపీలో మరో కొత్త జిల్లా.. త్వరలో ఏర్పాటు

New Districts

New Districts

ఏపీ కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు అమల్లోకి రాగా.. త్వరలో మరో కొత్త జిల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం జగన్ ఆలోచిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాలన్నీ కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.

మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలతో కొత్త జిల్లా ఏర్పాటుపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆ జిల్లా పేరు ఏంటి? ఎక్కడ ఏర్పడుతుంది అన్న అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని చెప్పారు. పోలవరం జిల్లా కేంద్రంగా 27వ జిల్లా ఏర్పడుతుందని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలో రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలిపి బ్రిడ్జి నిర్మాణం చేసే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రంపచోడవరం అల్లూరి సీతారామరాజు(పాడేరు) జిల్లాలో ఉండగా.. జిల్లా కేంద్రం సుమారుగా 200 కి.మీ. దూరంలో ఉంది.

https://ntvtelugu.com/lakshmi-parvathi-praises-ap-cm-jagan-about-new-districts/

 

Exit mobile version