సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.అప్పుడు అమ్మ ఒడి… ఇప్పుడు అమ్మకానికో బడిలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుం దన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీన నిర్ణయంతో విద్యార్థులే బలి పశువులుగా మారారని పవన్ ఆరోపించారు. విద్యార్థుల విషయంలో వారి భవిష్య త్తును నాశనం చేస్తూ ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. వీటిలో ఎన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజిమెంట్ కమిటీలు పని చేస్తున్నాయి..?
ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వంతో కలుపుకొనేందుకు లేదా స్వాధీన పర్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎందుకు తొందరపడు తోంది? విద్యార్థులు విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా సమయంకాని సమయంలో ప్రభుత్వం ఈ తెలివితక్కువ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
వైసీపీ ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాలతో విద్యార్థులను సమ స్యల్లోకి నెట్టివేస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. నిజంగా ఎయిడెడ్ పాఠశాలలను, టీచర్లను ఆదుకోవాలన్న ఉద్దేశం ఉంటే వాటిని స్వాధీ నపర్చుకోవడం ఒక్కటే మార్గమా..? ప్రత్యామ్నాయ మార్గాలు అన్వే షించాలన్నారు. విలీనం విషయంలో ప్రభుత్వానికి మరే ఇతర దురు ద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అంటూ విమర్శంచారు.
మూసేసిన పాఠశాలల్లో చదివే విద్యార్థులను దగ్గరలోని పాఠశాలలకు సంవత్సరం మధ్యలోనే తరలిస్తారా? ఇది వారి విద్యాసంవత్సరానికి అంతరాయం కలిగించదా? వారి చదువుకు అంతరాయం కాదా? డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? పాఠశాలలను, కళాశాలలను స్వాధీన పరుచుకోవాలన్న నిర్ణయం తీసుకొనేముందు టీచర్లను, లెక్చరర్లను నియమించాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాలేదా? అంటూ పవన్ వైసీపీని విమర్శించారు.
