Viral Video: ఒక్కప్పుడు పెళ్లిలో కూడా ఫొటోలు ఉండేవి కాదు.. రీల్ కెమెరాల కాలంలో పెళ్లిలో పరిమిత సంఖ్యలో ఫొటోలు తీసేవారు.. రానురాను పరిస్థితి మారిపోయింది.. డిజిటల్ కెమెరాల ఎంట్రీ తర్వాత.. చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.. ఎంగేజ్‌మెంట్ నుంచి డిన్నర్ వరకు ఫొటోలు తీయించడం.. అందులో మంచివి కొన్ని సెలక్ట్ చేసుకుని మిగతావి డెలిట్ చేయిస్తున్నారు.. ఇక, ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌కు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు.. వధూవరులు అందమైన లోకేషన్లకు వెళ్లి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లతో ఫొటో షూట్ చేయిస్తున్నారు.. వీడియోలు చిత్రీకరిస్తున్నారు.. వాటితో వెడ్డింగ్ ఇన్వినేషన్స్ కూడా రూపొందిస్తున్నారు.. ఇక, అసలు విషయానికి వస్తే.. ఉత్తరాంద్రలో ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లింది.. అక్కడి ఓ తాతయ్య చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Read Also: Atrocities Girls: అన్నమయ్య జిల్లాలో అమానుషం.. 14 ఏళ్లకే పసిబిడ్డను జన్మనిచ్చిన మైనర్ బాలిక
ప్రీ వెడ్డింగ్ షూట్లు ఢిపరెంట్‌గా ఉండేందుకు మంచి మంచి లోకేషన్లు, నదులు, సముద్రం.. కొండలు, అందమైన పార్కులు.. ఇలా ఎన్నో ఎంచుకుంటున్నారు.. ఇక్కడ ఆ జంట కాస్త ఢిపరెంట్‌గా నాటు పడవలో ఓ నదిలో ఫొటోలు దిగాలనుకున్నారు.. ఇక్కడే వాళ్లకు వింత అనుభవం ఎదురైంది.. నాటు పడవ నడిపిన తాత.. టాలెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అమ్మాయి, అబ్బాయి ఫొటో ఎలా దిగాలి.. ఎలాంటి ఫోజులు ఇవ్వాలి.. ఇలా నిలిచోండి.. అలా చేయి పట్టుకోండి.. చేతి ఇలా పెట్టు, కాలు ఇలా పెట్టు, అమ్మాయిని ఇలా పట్టుకో, ఇద్దరూ అటు చూసి ఫోజు ఇవ్వండి.. నువ్వు చేయి పైకి ఎత్తు.. అమ్మాయి.. ఆ చేయి పట్టుకుని చుట్టూ తిరుగుతుంది.. ఇలా.. తనలోని డైరెక్టర్‌ని బయటకు తీశాడు ఆ తాతయ్య.. ఉత్తరాంద్ర యాసలో ఆయన మాటలు వింటుంటే.. నవ్వకుండా ఉండలేరు.. ఎంతటివారైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వితీరాల్సిందే.. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయిన ఆ వీడియోను షేర్ చేస్తూ.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.. తాతయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. పడవ నడిపే తాతే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‍లా కన్పిస్తున్నాడని కొందరు కామెంట్ పెడితే.. తాతయ్య టాలెంట్ సూపర్ అంటూ మరికొందరు.. తాతకి అవకాశం ఇవ్వాలే గానీ.. మంచి రొమాంటిక్ మూవీ కూడా తీసేలా ఉన్నాడు అంటూ ఇంకా కొందరు కామెంట్ పెడుతున్నారు..