Site icon NTV Telugu

చిత్తూరులో మొత్తం 37 థియేటర్ల మూసివేతకు ఆదేశాలు…

చిత్తూరు జిల్లాలో మొత్తం 37 సినిమా థియేటర్ల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోట 3, బి.కొత్తకోట 2, పీలేరు 4, పుంగనూరు 4, పలమనేరు 4, రొంపిచర్ల 2, కలికిరి 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబల్ల పల్లిలలో ఒక్కే థియేటర్ కు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మధ్యాహ్నం నుంచే 30కి పైగా థియేటర్లు మూతపడ్డయి. అయితే ఈ విషయం పై మీడియాతో మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ… థియేటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, అధిక ధరలు వసూలు, లైసెన్స్ పై దృష్టి పెట్టాము. లైసెన్స్ రెన్యూవల్ నుంచి తినుబండారాల ధరలు, పార్కింగ్ వసూళ్లు, అపరిశుభ్రత పై చర్యలు తీసుకుంటున్నాము. అందరికీ నోటీసులు ఇచ్చాము. పబ్లిక్ సైతం థియేటర్లపై ఫిర్యాదులు చేయవచ్చు. లైసెన్స్ రెన్యూవల్ లేకుండా షోలు నడపవద్దని సంబంధిత థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసాము అని పేర్కొన్నారు.చిత్తూరులో మొత్తం 37 థియేటర్ల మూసివేతకు ఆదేశాలు…

Exit mobile version