గోదావరి – కావేరి జలాల అనుసంధానం కోసం ఆయా రాష్ట్రాలతో సమావేశం నిర్వహించినట్టు ఎన్ డబ్య్లూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని కోసం డీపీఆర్‌తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హిమాలయ బేసిన్లో ఉన్న మిగులు జలాలను దక్షిణానికి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. గోదావరి – కావేరి లింక్ కోసం ఇప్పటికే డీపీఆర్ రూపొందించినట్టు వెల్లడించారు.
దీనిని అన్ని రాష్ట్రాలకు డీపీఆర్ అందించామని దీనిపై ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలపాయని, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నట్టు భోపాల్ సింగ్ వెల్లడించారు. కొన్ని రాష్ట్రాలు మిగులు ఉన్న మిగులు జలాలు లేవు అంటున్నాయన్నారు. పది రాష్ట్రాల అభిప్రాయాల కోసం సమావేశం ఏర్పాటు చేసినట్టు భోపాల్ సింగ్ తెలిపారు. సానుకూల వాతావరణంలో సమావేశం జరిగినట్టు చెప్పారు.
కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్ లో ఉన్న నీటి లోటును తీర్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. పది లక్షల హెక్టార్లకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నటు వెల్లడించారు. ఇప్పటికే రూ. 87,000 కోట్ల అంచనా వ్యయంతో అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధిచిన వివరాలను ఇవ్వాలని, అన్ని రాష్ట్రాలను వారి అభిప్రాయాలు నెల రోజుల్లోపు తెలపాలని కోరినట్టు చెప్పారు.
ఆ తర్వాత తదుపరి ప్రక్రియ కొనసాగించనున్నట్టు చెప్పారు. నీటి లభ్యతకు సంబంధించి కేంద్ర జలసంఘం ద్వారా ఖచ్చితమైన అధ్యయనం జరగాలని తెలంగాణ కోరిందని, ఇదే సమయంలో ఏపీ తమ నీటివాటాకు భంగం కలగొద్దని తెలిపినట్టు భోపాల్ సింగ్ వెల్లడించారు.
