Site icon NTV Telugu

NTV Short News : ఎన్టీవీ షార్ట్‌ న్యూస్‌

ఈ నెల 24 నుండి మార్చి 8వ తేదీ వరకు శ్రీకాళహస్తి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ హరినారాయణ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

శ్రీకాకుళం నుంచి ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బస్సు యాత్ర ప్రారంభం కానుంది. శ్రీకాకుళం టు హిందూపురం వరకు విద్యారంగ పరిరక్షణ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని ఆటంకాలు ఎదురు చేసిన ఈ బస్సు యాత్ర జరిపితీరుతామని వారు వెల్లడించారు.

బ్రెజిల్‌లో వరద బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 117 మంది మరణించారు. బురదలో చాలా మంది కూరుకుపోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది గల్లంతయ్యారని.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బ్రెజిల్‌ అధికారులు తెలిపారు.

ఉక్రేయిన్‌పై దాడికి రష్యా సిద్ధంగా ఉందని అమెరికా హెచ్చరించింది. మరో 2 రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడన్‌ వ్యాఖ్యానించారు. రష్యా దాడి చేస్తుందనడానికి సంకేతాలు వచ్చాయని ఆయన అన్నారు. సరిహద్దు నుంచి రష్యా సైన్యాని వెనక్కి తగ్గించలేదని బైడన్‌ పేర్కొన్నారు.

నాగర్‌ కర్నూలు జిల్లాలోని కర్నూలు మండలం మార్చాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరిక గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులు కిరణ్మయి (22), శిరీష (20), అరవింద్‌ (23)గా గుర్తించారు.

Exit mobile version