NTV Telugu Site icon

Artist Talent: రావి ఆకుపై ఎన్టీవీ లోగో.. చిత్రకారుడి సృజనాత్మకత

Ntv 1

Ntv 1

తెలుగు న్యూస్ ఛానెల్స్ చరిత్రలో ఒక కొత్త శకం ఎన్టీవీ… ప్రతి క్షణం ప్రజాహితం అంటూ.. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఎన్టీవీ న్యూస్ ఛానెల్.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్లుగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. వినూత్నమయిన కార్యక్రమాలతో..రాజీలేని వార్తా కథనాలతో.. నిరంతరం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఎన్టీవీ తన ఠీవిని నిరూపించుకుంది. తెలుగు లోగిళ్లలో ఏ ఇంట చూసినా.. ఏ న్యూస్‌ వీక్షించాలన్నా.. ఇప్పుడు ఎన్టీవీ.. అంతలా తెలుగు వీక్షకులు ఎన్టీవీతో తమ విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్నారు.

2007 ఆగస్టు 30వ తేదీన ఎన్టీవీ 24 X 7 తెలుగు న్యూస్‌ ఛానెల్‌ను ప్రారంభించారు.. రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ తుమ్మల నరేంద్ర చౌదరిగారు.. ఆ తర్వాత.. భక్తి టీవీ, వనిత టీవీలతో ప్రజలకు మరింత చేరువయ్యారు.. భక్తికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా చూడాలంటే.. భక్తి టీవీ పెట్టాల్సిందే.. మహిళల్లో మరింత చైతన్య భావాలు కలగాలంటే వనితా టీవీ చూడాల్సిందే అనేలా వాటిని తీర్చిదిద్దారు.. మహిళల కోసం దక్షిణ భారత దేశంలో తొలి చానల్‌ ప్రారంభించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇప్పుడు ఎన్టీవీ తెలుగు న్యూస్‌ చానెల్‌ నంబర్‌ వన్‌గా కొనసాగుతోంది.. 15 ఏళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్టీవీ, భక్తిటీవీలకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ చిత్రకారుడు ఎన్టీవీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఎన్టీవీ 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నారాయణఖేడ్ కి చెందిన శివకుమార్ అనే చిత్రకారుడు రావి ఆకుపై శుభాకాంక్షలు తెలియజేశారు. రావి ఆకుపై ఎన్టీవీ లోగో చిత్రీకరించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతని సృజనాత్మకతకు అంతా ఫిదా అవుతున్నారు. ఎన్టీవీపై ఇంత అభిమానం చాటుకున్న శివకుమార్.. రావి ఆకుపై ఎంత అందంగా ఎన్టీవీని తీర్చిదిద్దాడో మీరూ చూడండి.

Read Also: CM KCR Meets LaluPrasad Yadav: లాలూప్రసాద్ యాదవ్ తో కేసీఆర్ భేటీ