NTV 15 Anniversary Celebrations: నేడు ఎన్టీవీ 15వ వార్సికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో.. ఏపీలో ఎన్టీవీ కార్యాలయాలు వార్షికోత్సవ వేడుకలకు సర్వంగ సుందరంగా ముస్తాబయ్యాయి. టీంల వారిగా కేక్‌కు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికి ఎన్టీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రముఖులు హాజరై ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుని ఎన్టీవీ 15వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడలో ఎన్టీవీ వార్సికోత్సవ సంబురాలు..
విజయవాడలో ఎన్టీవీ ఆఫీస్ లో 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో.. ఎన్టీయార్ జిల్లా కలెక్టర్ దీల్లిరావు హాజరై ఎన్టీయార్, కృష్ణ జిల్లాల రిపోర్టర్లు, మార్కెటింగ్, టెక్నికల్, కెమెరా సిబ్బందితో కలసి కేక్ కట్ చేసారు. సిబ్బందిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇలాంటి సంస్థకు ఛైర్మెన్ గా వున్న నరేంద్ర చౌదరీకి ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి పార్టీకి కొమ్ము కాయకుండ నిలిచిన ఛానెల్ ఎన్టీవి మాత్రమే అని కొనియాడారు. ప్రతి క్షణం ప్రజాహితం స్లోగన్ ఒక గొప్ప ప్రేరణ అని తెలిపారు. తను కూడ ఎన్టీవీ ఎక్కువ చూస్తానని, ఎన్టీవీ ఎలక్షన్ సర్వే ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తారని,
కోటి దీపోత్సవం చాలా పాప్యులర్ అయ్యిందని పేర్కొ్న్నారు. ఎన్టీవీలో డైనమిక్ రిపోర్టర్లు వున్నారని అన్నారు.
100 సంవత్సరాలు ఇలానే ఎన్టీవీ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తిరుపతిలో ఎన్టీవీ వార్సికోత్సవ సంబురాలు..
తిరుపతిలో ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకలు అట్ట హాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా కలేక్టర్ వేంకటరమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. నిష్పాక్షిక వార్తా ప్రసారాలో ముందుంటున్న ఎన్టీవీకి కలెక్టర్ 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు సంవత్సరాలుగా టీఆర్‌పీ రేటింగ్స్ లో ఎన్టీవీ ముందు వుంది అంటేనే ఎన్టీవీ వార్త ప్రసారాల నాణ్యతను తెలియజేస్తుంది. నెంబర్ వన్ స్థానంలో ప్రస్థానం కొనసాగిస్తూన్న ఎన్టీవీ యాజమాన్యానికి 15 వార్షికోత్సవ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవాలను ప్రసారం చెయ్యడంలో ఎన్టీవీ ఎల్లవేళ ముందుంటుందని ఆయన అన్నారు. దేశంలోనే భక్తి టివి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ.. హిందూ ధార్మిక ప్రచారానికి దిక్సూచిలా కొనసాగుతుందని అన్నారు.
కర్నూలు జిల్లాలో ఎన్టీవీ వార్సికోత్సవ సంబురాలు
కర్నూలు జిల్లాలో ఎన్టీవీ 15వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. కలెక్టర్ కోటేశ్వర రావు, ఎస్పీ సిధార్థ కౌశల్ కేక్ కట్ చేసారు. ఎన్టీవీకి కలెక్టర్, ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మీడియా సహకరించి, ప్రజలకు మేలు చేయాలని కోరారు.
ఏలూరు జిల్లా ఎన్టీవీ వార్సికోత్సవ సంబురాలు
ఏలూరు జిల్లాలో Ntv 15వార్షికోత్సవ వేడుకలో అడిషనల్ ఎస్పీ K.చక్రవర్తి పాల్గొన్నారు. వుమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ntv సిబ్బందితో కలిసి ఏఎస్పీ చక్రవర్తి కేక్ కట్ చేసారు. తను సర్వీస్ లోకి రాకముందు నుంచి Ntv న్యూస్ ఫాలో అవుతుంటానని పేర్కొన్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, క్షణాల్లో అందించడంలో NTV ముందుంటుందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో వుండే ప్రతి ఇంట్లో ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకోవడం ఒక అలవాటుగా మారిందని అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి పుణ్య క్షేత్రాలను దర్శించలేని వారికి భక్తి టీవీ ఆ లోటు లేకుండా చూస్తుందని తెలిపారు.
విశాఖలో ఎన్టీవీ వార్సికోత్సవ సంబురాలు:
విశాఖలోని సీతమ్మధార NTV ఆఫీసులో అత్యంత వైభవంగా వార్షికోత్సవ వేడుకల్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ లక్ష్మీశ పాల్గొని, జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ప్రజాసమస్యలపై పోరాటంలో NTV నెంబర్ వన్ అని, ఆ ఒరవడిని కొనసాగించాలని ఆకాంక్షించారు. నిజాయితీ, నిబద్ధతతో కూడిన వార్తలను అందిస్తూ మరిన్నీ ఉన్నత శిఖరాలకు NTV చేరుకోవాలని అన్నారు. జీవీఎంసీ పరిపాలన, ప్రణాళికలను ప్రజల ముందుకు తీసుకుని వెళ్లడంలో NTV పూర్తి సహాకారం అందిస్తుందని తెలిపారు.
కాకినాడ ఎన్టీవీ వార్సికోత్సవ సంబురాలు:
కాకినాడ లో ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకల్లో ఆర్డీఓ రమణ పాల్గొన్నారు. ఎన్టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీవీ వార్తలు పరంగా దిన దినాభి వృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. నరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో ఎన్టీవీ నిబద్ధతతో పని చేస్తుందని అన్నారు. భక్తి టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కోటి దినోత్సవం చాలా అద్భుతమైన కార్యక్రమమని అన్నారు. ప్రేక్షకులు ఎన్టీవీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
రాజమండ్రిలో ఎన్టీవి వార్షికోత్సవ వేడుకలు…
రాజమండ్రిలో ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ముఖ్య అతిధి సమాచార శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ మాధవీ లత పాల్గొని కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. భక్తిటీవీలో కోటి దినోత్సవం చాలా అద్భుతమైన కార్యక్రమమని, ప్రేక్షకులు ఎన్టీవీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.