MP Kesineni Chinni: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.. 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం 5 కోట్ల రూపాయాలు కేశినేని చిన్ని అడిగారని ఆరోపించిన కొలికపూడి.. తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా 60 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తన ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టారు.. ఇక, ఎంపీ చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి తీసుకువెళ్లిన రూ. 50 లక్షలు.. నా మిత్రులు ఇచ్చిన రూ. 3.50 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం.. నిజమే గెలవాలి అంటూ పోస్టులు పెట్టారు కొలికపూడి.. దీంతో, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఒకసారిగా పొలిటికల్ హీట్ పుట్టింది.. ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వార్ పీక్‌కు చేరినట్టు అయ్యింది.. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే కొలికపూడికి ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు.
Read Also: Puri Jagannadh: పూరి జగన్నాథ్ ఫోకస్ అంతా ‘పూరి సేతుపతి’ పైనే!
నేను ఎప్పుడు నా జేబులో డబ్బులు మాత్రమే ఖర్చు పెడతాను అని స్పష్టం చేశారు ఎంపీ కేశినేని చిన్ని.. విజయవాడ ఉత్సవాలతో నష్టపోయారు.. కేవలం ఐదు లక్షలు.. పది లక్షల గురించి నాపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.. ఇవన్నీ ప్రజల నమ్మరన్న ఆయన.. వీటిని పార్టీ నాయకత్వం, అధిష్టానం చూసుకుంటుందని పేర్కొన్నారు. నేను ఎప్పుడు రంగులు మార్చలేదన్నారు.. అయితే.. 12 నెలలు దేవుడిగా ఉన్న నేను.. ఇప్పుడు దెయ్యంగా మారాను అంటే ఎమ్మెల్యే కొలికిపూడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, ఎంపీ కేశినేని చిన్న లేకపోతే నేనులేను అని చెప్పిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు చేస్తున్న విమర్శలకు ఆయనే సమాధానం చెప్పాలని సూచించారు.. నేనంటే విజయవాడ పార్లమెంటు ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు ఎంపీ కేశినేని చిన్ని..
