NTV Telugu Site icon

MLA Kolikapudi: టీడీపీలో కాకరేపుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్..

Kolikapudi

Kolikapudi

MLA Kolikapudi: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ పార్టీలో కాక రేపుతుంది. గత కొంత కాలంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొలికపూడి ఎపిసోడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పార్టీ నేత రమేష్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని రెండు రోజుల క్రితం కొలికపూడి ప్రకటించారు. కాగా, ఇవాళ 11 గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తవనుంది. ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై చర్చ జోరుగా కొనసాగుతుంది.

Read Also: TDP Formation Day: నేడు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

మరోవైపు కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై తెలుగు దేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్ కో ఆర్డినేటర్, విజయవాడ ఎంపీలతో కూడిన ముగ్గురిని కలిపి టీడీపీ అధిష్ఠానంకు నివేదిక కోరగా.. గత 10 నెలల నుంచి జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో రిపోర్ట్ లో పేర్కొనాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో శుక్రవారం నాడు రాత్రి పార్టీ హైకమాండ్‌కు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నివేదిక అందజేసింది. ఇక, కొలికపూడిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుంది.

Read Also: Earthquakes: 150కి చేరిన మయన్మార్, బ్యాంకాక్ భూకంప మృతుల సంఖ్య

అయితే, తెలుగు దేశం పార్టీ అధిష్టానం సీరియస్ అవటంతో తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస రావు రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకుంటాడా.. ముందుకు వెళ్తాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నియోజక వర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం తర్వాత DRC మీటింగ్ లో ఎమ్మెల్యే కొలికపూడి పాల్గొననున్నారు.