NTV Telugu Site icon

Bird Flu: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌.. కోళ్ల ఫారాల్లో తనిఖీలకు కలెక్టర్‌ ఆదేశాలు..

Collector Lakshmi Shah

Collector Lakshmi Shah

Bird Flu: ఉమ్మడి గోదావరి జిల్లాలను టెన్షన్‌ పెడుతోన్న బర్డ్‌ ఫ్లూ వైరస్‌.. ఎన్టీఆర్ జిల్లాను సైతం తాకింది.. ఇక, ఇప్పటికే తెలంగాణలోని నిజామాబాద్‌.. పరిసర ప్రాంతాల్లో కూడా బర్డ్ ఫ్లూ , కొక్కెర వైరస్ కోళ్ల పరిశ్రమను ఓ కుదుపు కుదుపుతోంది.. ఇక, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో.. అనుమలంకలో ఇప్పటికే 13 వేలకు పైగా కోళ్లు మృతి చెందటంతో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఫారాల్లో తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్‌ లక్ష్మీ షా.. జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ ఫామ్‌లలో తనిఖీలు నిర్వహించి బర్డ్‌ ఫ్లూ పరిస్థితులను అంచనా వేయాలని పేర్కొన్నారు..

Read Also: Maha Kumbh Mela: మాఘి పూర్ణిమకు పోటెత్తిన భక్తులు.. ఉదయం నుంచి 73 లక్షల మంది స్నానాలు

మరోవైపు. చికెన్, గుడ్లు తినటంపై ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావొద్దని చెబుతున్నారు పశు సంవర్థక శాఖ అధికారులు.. 100 డిగ్రీల వేడిలో చికెన్, గుడ్లు ఉడకబెట్టి తినవచ్చని చెబుతున్నారు అధికారులు.. అనుమలంక గ్రామంలో మాత్రమే ఈ విధంగా కోళ్లు మృతి చెందినట్టు గుర్తించారు.. అయితే, జిల్లాలో ఉన్న మొత్తం 116 కోళ్ల ఫారాల్లో పరిశీలన జరపాలని నిర్ణయం తీసుకున్నారు.. దీని కోసం 17 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలతో ఈ తనిఖీలు చేపట్టనున్నారు.. కాగా, ఆంధప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది.. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా ప్రకటించారు.. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా (అలర్ట్ జోన్) గుర్తించి.. ఆ జోన్ లో కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం విధించారు.. చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు.. ఆ పరిధిలో అన్ని చికెన్ దుకాణాలు, గుళ్ల విక్రయాల షాపులను మూసివేశారు.. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.. ఇక, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో బర్త్ ప్లూ కలకలంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.. కిలో మీటర్ పరిధిని పరిమిత జోన్ గా, 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు.. పరిమిత జోన్లో పౌల్ట్రీ ఉత్పత్తుల తరలింపు నిలిపివేశారు.. సర్వేలెన్స్ జోన్ లో చికెన్ షాపుల్లో పనిచేసేవారికి స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. వైరస్ ఇతర జంతువులకు సోకకుండా వ్యాక్సినేషన్‌ జరుగుతోంది.. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి వైద్య బృందాలు.. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తోన్న విషయం విదితమే.