Nandigama Municipal Chairman Election: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఎమ్మెల్యేగా తాను సూచించిన కౌన్సిలర్ సత్యవతి పేరు పై బీఫామ్ వస్తుందని ఆశించారు తంగిరాల సౌమ్య.. అయితే, ఎమ్మెల్యే సౌమ్యకు మరోసారి షాక్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. ఎమ్మెల్యే సూచించిన పేరు.. ఎంపీ సూచించిన పేరు కాకుండా మధ్యే మార్గంగా పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణ కుమారి పేరు మీద బీఫామ్ అధిష్టానం పంపడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.. కౌన్సిలర్లను తీసుకొని నేరుగా ఎన్నిక జరిగే జగజ్జీవన్ రామ్ భవనంకు చేరుకున్నారు.. బీఫామ్ లేకుండా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతితో నామినేషన్ వేసేందుకు సిద్ధం అయ్యారు.. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించిన 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి కౌన్సిలర్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని.. బీఫామ్ లేదు కాబట్టి ఇండిపెండెంట్‌గా సత్యవతి చైర్మన్ అయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
Read Also: Allu Aravind : దేవి శ్రీ ప్రసాద్‌ని వద్దు అనడానికి కారణం ఇదే : అల్లు అరవింద్
మరోవైపు.. మంత్రి నారాయణ నుండి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ఫోన్ వచ్చిందట.. ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన అభ్యర్థి కాకుండా అధిష్టానం సూచించిన పేరును ఫైనల్ చేయాలని స్పష్టం చేశారట మంత్రి నారాయణ.. దీంతో.. పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూల్ అయినట్టుగా తెలుస్తోంది.. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా మధ్యే మార్గంగా అధిష్టానం సూచించిన పదో వార్డు కౌన్సిలర్ కృష్ణ కుమారికి మద్దతు తెలపాలని అధిష్టానం ఎమ్మెల్యేకు సూచించడంతో.. ఆ వెంటనే ఆమెకు మద్దతు ప్రకటించారు ఎమ్మెల్యే సౌమ్య.. అధిష్టానం చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని మంత్రి నారాయణకు తెలిపారట ఎమ్మెల్యే సౌమ్య.. దీంతో.. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగే అవకాశం కనిపిస్తోంది.