Site icon NTV Telugu

AP Crime: ఎన్టీఆర్ జిల్లాలో మహిళ సూసైడ్‌ కలకలం.. సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యేకి వినతి..!

Crime

Crime

AP Crime: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అబ్బూరి మాధురీ అనే మహిళ సూసైడ్ కలకలం రేపుతోంది.. సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి మాధురి.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెల్లడించింది.. చందర్లపాడు మండలం (విభరింతలపాడు) సంగళ్లపాలెంలో అబ్బూరి మాధురి.. తన కుటుంబంతో కలిసి ఉంటుంది.. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనికి వెళ్లగా ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ అవమానించటంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకుంటున్నానని.. తన సూసైడ్ కు రవితేజ కారణమని.. అతడిపై చర్యలు తీసుకోవాలని.. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను తన సెల్ఫీ వీడియోలో కోరింది మాధురి.. ఆ తర్వాత పురుగుల మందు తాగటంతో మాధురి మృతి చెందింది. సూసైడ్ కు ముందు మాధురి మాట్లాడిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

Read Also: Operation Sindoor: భారత్‌కు నష్టమేమీ జరగలేదు.. ఏకే భారతి వెల్లడి

Exit mobile version