NTV Telugu Site icon

NSG IG in TDP Office: టీడీపీ ఆఫీస్‌కు ఎన్‌ఎస్‌జీ ఐజీ.. విషయం ఇదే..!

Nsg

Nsg

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను సందర్శించింది నేషనల్​ సెక్యూరిటీ గార్డ్​​ (ఎన్‌ఎస్‌జీ) టీమ్‌… ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఎన్‌ఎస్‌జీ ఐజీ సిమిర్దీప్ సింగ్ నేతృత్వంలోని టీమ్.. టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించింది.. ఆఫీసులోని ప్రతీ గదిని పరిశీలించారు.. అంతే కాదు.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని కూడా పరిశీలించారు.. నివాసంలోని ప్రతీ గదిని వారు పరిశీలించినట్టుగా చెబుతున్నారు. చంద్రబాబు భద్రతపై తాము ఆందోళన వ్యక్తం చేస్తూ గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని తెలిపాయి టీడీపీ వర్గాలు.. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్‌ఎస్‌జీ.. అందులో భాగంగానే ఇవాళ చంద్రబాబు నివాసంతో పాటు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని పరిశీలించారు.

Read Also: Kodali Nani: ఎన్టీఆర్‌పై మరోసారి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. అప్పుడే బాధ్యతలు తీసుకుంటారు..!