Site icon NTV Telugu

ఏపీలో 1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ : ఏపీపీఎస్సీ

1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని… ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పొడిగించాలన్న ప్రతిపాదనలని ప్రభుత్వానికి పంపామని… ఏపీపీఎస్సీ సభ్యులు సలాం బాబా అన్నారు. ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ మార్పులు చేయాలని… గతంలో ఏపీపీఎస్సీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

read also : విభజన చట్టం ప్రకారమే నీటి వాటా పంపిణీ : జల్ శక్తి శాఖ

ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు కానుందని.. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీవోలు 39, 150లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. గ్రూప్ వన్ పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ నిర్వహిస్తామని… గ్రూప్-1లో ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానాన్ని అమలు చేసేలా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని… ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆగస్టు నుంచి ఏపీపీఎస్సీ అమలు చేస్తుందరి తెలిపారు. అగ్ర వర్ణ పేదలకిచ్చే రిజర్వేషన్లపై రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయాలని వెల్లడించారు.

Exit mobile version