విభజన చట్టం ప్రకారమే నీటి వాటా పంపిణీ : జల్ శక్తి శాఖ

జల వివాదంపై క్లారిటీ ఇచ్చారు సంయుక్త కార్యదర్శి, కేంద్ర జలశక్తి శాఖ సంజయ్ అవస్తీ. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను వివరించిన ఆయన… విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉందని…సెక్షన్ 84 ప్రకారం రెండు నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, పరిధి నోటిఫై చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డ్ పరిధి నోటిఫై చేయాలని నిర్ణయం చేయడం జరిగిందని… ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎం లు పాల్గొన్నారని వెల్లడించారు.

read also : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

పూర్తి స్థాయిలో చర్చించి గెజిట్ తయారు చేశామని.. రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. బోర్డు ల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో 200 కోట్లు ఇవ్వాలని… డబ్బుకు ఎలాంటి లోటు రాకూడదని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి చాలా సమయం పట్టిందని…. అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగి నాలుగు సంవత్సరాలు పట్టిందని వెల్లడించారు. సెక్షన్ 87 ప్రకారం బోర్డు పరిధి నోటిఫై చేసే అధికారం ఉందని… నోటిఫై చేసేందుకు మేము చాలా సమయం వేచి చూశామన్నారు. షెడ్యూల్-1 లో అన్ని ప్రాజెక్ట్స్ పేర్కొనగా.. షెడ్యూల్-2 లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ బోర్డుల పరిధిలోనే ఉంటాయని వెల్లడించారు. షెడ్యూల్-3 లో ఉండే ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-