Site icon NTV Telugu

AP Deputy Speaker Election: డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Ap Assembly

Ap Assembly

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీని కోసం ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.. ఇవాళ సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.. మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేసే అవకాశం ఉంది… మరోవైపు తమ అభ్యర్థిని బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా సమాచారం.. సభలో ఉన్న బలాబలాల దృష్ట్యా.. నామినేషన్‌ వేసేందుకు టీడీపీ సానుకూలంగా లేనట్టుగా తెలుస్తోంది.. దీంతో.. ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కవగా కనిపిస్తున్నాయి.. అయితే, ఎవరైనా నామినేషన్‌ దాఖలు చేస్తే మాత్రం.. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక.. సోమవారం జరగనుంది.. కాగా, డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయడంతో.. కొత్త డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విదితమే.

Read Also: Amaravati : మోడీ శంకుస్థాపన చేశారు.. ముమ్మాటికీ అమరావతే రాజధాని..!

Exit mobile version