NTV Telugu Site icon

తెలుగుకి ఇప్పుడు కాదు.. ఎప్పుడో అన్యాయం జరిగింది: లక్ష్మీ పార్వతి

రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన భాషా చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్..లక్ష్మీ పార్వతి హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుకు ఇప్పుడు కాదు.. ఎప్పుడో అన్యాయం జరిగిందన్నారు. తెలుగు భాషమీద, సంస్కృతం మీద పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయయని వీటిని అధిగమించేందుకు, వివరంగా తెలుసుకునేందుకు యూనిర్సిటీల్లో చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.


సంస్కృతం అనే పదం చేర్చడం వలన వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎడ్యుకేషన్‌లో ఇంగ్లీషు మీడియం తెచ్చారని చాలా గొడవ చేస్తు న్నారని, ప్రముఖుల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని ఆమె అన్నారు. ఇంగ్లీషు మీడియం స్కూల్ లు కాలేజీలు రావడంతో తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగిందన్నారు. దీంతో ప్రభుత్వ స్కూళ్ళు మూత పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు.

గత ప్రభుత్వాలు ఇంగ్లీషు మీడియంలో తెలుగు భాషను తప్పని సరి చేయలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పని సరి చేసిందని పేర్కొన్నారు. దీంతో మాతృభాషకు స్థానం దక్కింద న్నారు. దీన్ని తప్పుబడుతున్న వారి పిల్లలంతా ఇంగ్లీషు మీడియం స్కూళ్లలొనే చదువుతున్నారు. వారేందుకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించటం లేదో చెప్పాలన్నారు. చాలా స్వార్థం..పేద వాళ్ళు పేద పిల్లలు మాత్రమే తెలుగుని కాపాడాలా..మిగతా వాళ్ల పై ఆ బాధ్యత లేదా అంటూ లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.