పెళ్లి ముహూర్తాలు ఈ రోజుతో ముగియనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వేల జంటలు ఒక్కటవుతున్నాయి. సెప్టెంబర్లో భాద్రపదం మాసం శుక్రమూఢమి ప్రారంభంతో ముహూర్తాలు లేవు. అక్టోబర్, నవంబర్ నెలల్లోనూ శుక్ర మూఢమితో మంచిరోజులు లేవు. డిసెంబర్ 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాది 2022లో శ్రావణ మాసంలో ఆగస్టు నెల 21 వరకే పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయని పండితులు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నవ జంటలు అన్నీ ఒక్కటవుతున్నాయి. ఆగస్టు ఒకటో తారీకు నుంచి మూడోవారం వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు ఏర్పాట్లుచేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ముహుర్తాలు పెట్టుకున్న వారి ఇళ్లల్లో పెళ్లి సందడి భారీగా కనిపించింది. ఎటు చూసినా పెళ్ళి ముహుర్తాలతో కళ్యాణ మండపాలు.. ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడిపోతున్నాయి. ఈ ముహూర్తాలు కొద్ది రోజులే ఉండడంతో వాటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆగస్టు 1, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 16, 17, 20, 21 తేదీల్లో అధిక ముహూర్తాలు ఉన్నాయని పండితులు తెలిపారు. ఈనేపథ్యంలో.. ఆగస్టులో ముహూర్తం కుదరకపోతే తర్వాత 4 నెలల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు ఆగస్టులోనే పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పండితులు చెప్పిన విధంగా చూస్తే.. పెళ్ళిళ్లకు ఇవాళే లాస్ట్ తేది కావడంతో.. మళ్లీ పెళ్లి ముహూర్తాలు డిసెంబర్ వరకు లేకపోవడంతో కాస్త నిరాసతో వున్నారు. దీంతో.. ఈరోజు పెళ్లిళ్లకు లాస్ట్ డేట్ కావడంతో.. ఎటుచూసిన పెళ్లి హడావిడి కనిపిస్తోంది. ఇక పెళ్లి చేసుకోవాలంటే ముహూర్తం కోసం డిసెంబర్ వరకు ఆగాల్సిందే మరి.
Uttarpradesh: విద్యాశాఖ మంత్రి కాలేజికి వచ్చినా అనుమతించలేదు.. కోపంతో వెనుదిరిగిన మంత్రి