Site icon NTV Telugu

Leopard In Tirumala: చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదు

Chirutha

Chirutha

Leopard In Tirumala: చిరుత సంచారం వల్ల ఆందోళన చేయాల్సిన అవసరం లేదని తిరుపతి డీఎఫ్ఓ అధికారి సాయి బాబా తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయవచ్చు.. మొబైల్ ఫోన్స్ ద్వారా సమాచారం అందించవచ్చు.. 15 మందితో టీమ్ ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నామని పేర్కొన్నారు. అలిపిరి నడక మార్గంలో మరింత కాంతి వంతంగా లైటింగ్ ఏర్పాటు చేశాం.. అలిపిరిలో 10, యూనివర్సిటీ పరిధిలో 5 మంది సిబ్బందిని కేటాయించాం.. ఇన్ఫ్రార్డ్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాం.. వ్యర్థాలు అనేక ప్రాంతాల్లో డంప్ చేయడం వల్లే చిరుతలు వస్తున్నాయి.. డంప్లో ఆహారం కోసం కుక్కల, ఎలుకలు అధికంగా వస్తున్నాయి.. వాటిని ఆహారంగా చేసుకోడానికి చిరుతలు ఆ ప్రాంతాల్లో అధికంగా తిరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారి వెల్లడించారు.

Read Also: Pakistan: ట్రంప్‌పై పాకిస్థాన్ ఆగ్రహం.. “అబద్ధాలకోరు” అని ముద్ర..

ఇక, యూనివర్సిటీలో జన సంచారం సమయాన్ని మార్చాలి, చెత్తను డంపింగ్ యార్డులలో వేయాలని డీఎఫ్ఓ సాయిబాబా చెప్పారు. అనేక ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయడం ద్వారా చిరుత సంచారాలు అధికం అవుతున్నాయి.. చిరుతను బంధించాల్సిన అవసరం లేదు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ కెమెరాలను రైల్వే ట్రాక్స్, హైవేలకు దగ్గర ఏర్పాటు చేస్తాం.. అవసరాన్ని బట్టి పంట పొలాల దగ్గర కూడా ఏర్పాటు చేసే యోచన చేస్తున్నామని పేర్కొన్నారు. కుంకి ఏనుగులతో చిత్తూరు జిల్లాలో ఎక్కువ అవసరం ఉంటుంది.. తిరుపతి జిల్లాలో కుంకీ ఏనుగులను వినియోగించే పరిస్థితి ఉండదని తెలియజేశారు.

Exit mobile version