NTV Telugu Site icon

ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ పొడిగింపు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  కేసులు త‌గ్గుతున్నా తీవ్ర‌త ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో ముందుజాగ్ర‌త్త‌లో భాగంగా నైట్ క‌ర్ఫ్యూను మ‌రోసారి పొడిగించారు.  రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కూ కర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది.  ఆగ‌స్టు 14 వ తేదీ వ‌ర‌కు ఈ నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది.  క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఏపీలో రోజువారీ కేసులు 2 వేల వ‌ర‌కు న‌మోదవుతున్నాయి.  అయితే, కేర‌ళలో రోజువారీ కేసులు ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం, అటు క‌ర్నాట‌క‌లో కూడా పాజిటివ్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండటంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  

Read: సంక్రాంతి బరిలో “సర్కారు వారి పాట” కూడా..!!