రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో విచారణ జరిపారు. తెలంగాణ సమర్పించిన ఫోటోలను ఎన్జీటీ పరిశీలన చేసింది. కోర్టు ధిక్కరణకు ఏపీ పాల్పడినట్లు అర్థం అవుతోంది’’ అని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. ధిక్కరణ కేసులో గతంలో అధికారులను జైలుకు పంపారా అని ప్రశ్నిచింది. అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా? లేక హైకోర్టు ద్వారా అధికారులను జైలుకు పంపాలా అని పిటిషనర్ల అభిప్రాయాన్ని కోరింది ఎన్జీటీ. అధికారులను శిక్షించిన సందర్భాలు ఎదురుకాలేదన్న ఎన్జీటీ… పర్యావరణ శాఖతో ఏపీ కుమ్మక్కైనట్లు అనిపిస్తోందని అభిప్రాయపడింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నై ధర్మాసనంలో విచారణ
