రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటి తీర్పు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు తేలితే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తున్నారని, తెలంగాణ సర్పంచ్ ల సంఘం నేత గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను జస్టిస్ రామకృష్ణన్ , ఎక్స్ పర్ట్ మెంబర్ సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఈరోజు విచారించింది. ఎన్జిటి ఆదేశాలను ధిక్కరించి ఏపి ప్రభుత్వం “కరోనా” సెకండ్ వేవ్ “లాక్ డౌన్” సందర్భంగా పనులను చేపడుతున్నారని వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు న్యాయవాది.
read also : తెలంగాణకు భారీ వర్ష సూచన…
రాయలసీమ ఎత్తిపోతల పథకంను తనిఖీలు జరపాలన్న ఎన్ జి టి ఆదేశాల మేరకు తనిఖీ జరపుతామన్న “కృష్ణ నది యాజమాన్య బోర్డు”కు ఏపి ప్రభుత్వం సహకరించడం లేదని వివరించారు. ఒకవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఎన్.జి.టి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ శాఖకు ఏపి ప్రభుత్వం లేఖలు రాస్తోందని వివరించారు. వాదనలు విన్న ఎన్జీటీ… ఏపీ ప్రభుత్వంపై మొట్టి కాయలు చేసింది. ఇక తదుపరి విచారణ జులై 12 కి వాయిదా వేసింది ఎన్జీటీ.
